Ephatha Retreat Centre
ఎఫ్ఫాతా: మార్కు సువార్త 7:34లో మూగ చెవిటి వానికి స్వస్థతనిస్తూ యేసు ప్రభువు పలికిన అరమాయిక్ పదమే ఎఫ్ఫాతా. “తెరువబడుము” అని ఈ పదానికి అర్థం . ఎఫ్ఫాతా అని పలుకగానే అతని చెవులు తెరువబడ్డాయి, నాలుక పట్టు సడలి తేలికగా మాట్లాడసాగాడు. అతను సంపూర్ణ స్వస్థతను, విడుదలను పొందుకున్నాడు. అదే విధంగా, ఎఫ్ఫాతా ధ్యాన కేంద్రమును సందర్శించు వారందరు దైవ వాక్య పరిచర్య ద్వారా సమృద్ధిగా జీవమును, పాపం మరియు దుష్టాత్మ శక్తుల నుండి విడుదలను పొందుటకు “తెరువబడుతారు”.
విశ్వాసులు మరియు నూతనంగా క్రీస్తును గురించి తెలుసుకున్న వారు లోతుగా విశ్వాసంలో ఎదుగుటకు, సువార్తను బోధించుటకు, విశ్వాస సంబంధమైన విషయాలను తెలియజేయుటకు, ప్రార్ధనలో, ఆత్మీయతలో ఎదిగే విధంగా అందరిని నడిపించుటకు అదిలాబాద్ మేత్రాసనంలోని అసిఫాబాద్ జిల్లా రెబ్బెన ప్రాంతంలోని "ఎఫ్ఫాతా ధ్యాన కేంద్రం" నిర్మాణం జరిగింది. ఇది మన సువార్త పరిచర్య ప్రయాణంలో మరొక అడుగు. ఈ ధ్యాన కేంద్రం అనేక మందిని దేవుని సన్నిధికి ఆకర్షిస్తూ ఉంది.
02 ఏప్రిల్ 2018 నాడు శంకుస్థాపన చేయబడి 28 మార్చి 2019 నాడు ధ్యాన కేంద్ర నిర్మాణ పనులు ఆరంభించబడ్డాయి. 06 జనవరి 2022 నాడు రోములోని పరిశుద్ధ పాపు గారి దూత ఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి గారిచే ఎఫ్ఫాతా ధ్యాన కేంద్రం ప్రతిష్టించబడింది. ధ్యాన కేంద్ర ప్రాంగణంలో జపమాల తోట, 14 స్థలాలు, యాకోబు బావి, రక్షణ చరిత్ర వంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి.
ఎఫాతా ధ్యాన కేంద్ర కార్యక్రమాలు
1. ప్రతి రోజు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు దివ్యసత్ప్రసాద ఆరాధన
2. ప్రతి శుక్రవారం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు ఉపవాస ప్రార్థన, ఆరాధన మరియు దివ్యపూజాబలి
3. ప్రతి బుధవారము ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు పాపసంకీర్తనం మరియు కౌన్సిలింగ్
4. ప్రతి నెల రెండవ శుక్రవారం జాగరణ ప్రార్థనలు - రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు
5. ప్రతి నెల మొదటి సోమవారము కేశఖండన (పుట్టు వెంట్రుకలు తీయడం).
ఈ ధ్యాన కేంద్రంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు మరియు ధ్యాన కేంద్ర నిర్వహణ కొరకు మన వంతు ఉదారమైన సాయం చేద్దాం. చిన్న చిన్న త్యాగాలు చేసి ధ్యాన కేంద్రం నిర్వహణకు తోడ్పడుదాం. మనం కొంచెం త్యాగం చేసినట్లయితే, మనకు వీలైనంతలో సహాయాన్ని అందించవచ్చు.
ఎఫ్ఫాతా ధ్యాన కేంద్రం కొరకు మీ వంతు సాయం చేయాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా గానీ లేక రాతపూర్వకంగా తెలియజేయగలరు.